Monday, November 7, 2011

Dana Veera sura karna movie dialogues

Ultimate dialogues by Sr NTR

1 - Acharya dheva
yemantivi yemantivi
Jathi nepamuna sutha suthala kintha niluva arhatha ledhantiva yentha mata yentha mata

Idhi chathra pariksha kani Kshathriya pariksha kadhe???
kadhu kakudadhu Idhi kula parikshaye andhuva
ne tandri bharadwajuni jananamettidi?
atii dhubukshakaramina ni sambhavamettidhi?

matti kundalo puttithivi kadha needhi ye kulamu?
Intha yela, asmadhpitha mahudu kurukula vrudhdhu daiyna e shanta ramudu siva samudhra bharya ina ganga garbhamuna janiminchaleda eyanadhi ye kulamu?

natho chepputhuntivemayya ma vamsamunaku mula purushudina vasishtudu deva veshya agu urvasi puthrudu kada?
athadu panmachami jathi kanya ina arundhathi yendhu shakthini a shakthi chadalangane yandhu paraseruni
a paraserudu palle paduchaina machegandhi yendhu ma thatha vyasuni a vyusudu vidhvarandliya ma pithamahi ambika tho ma thandrini pena pithamahi ambalika tho ma pina thandri anduraju nu ma inti dasi tho dharma nirmana janudani miche keerthimpa badu thunna e vidhuna devuni kana ledha?

sandhrabhavasaramulanu batti kshethra bhijja radhanyamulatho
shankaramina ma kuru vamshamu yenado kula hina minadhi
kaga nedu kulamu kulamu anu vyardha vadhmulendhuku????

2 -


69 comments:

  1. nice collection..... is there 2nd showing continuation vunda

    ReplyDelete
  2. yes...second one prepare chestanu..inkonni vunnayi manchi dialogues...collect chesi pedatanu Anirwesh

    ReplyDelete
  3. very nice and famous dialogues of Sr.NTR

    ReplyDelete
  4. I want dhuryodhana dailogue after maya sabha parabhavam

    ReplyDelete
  5. Oho racharikama arhatanu nirnayinchunadi

    Aina maa samrajyam lo sasyasyamala mai sampadabhiramamai velugondu anga rajyamunaku ipude itanni moortabhishiktunni gavinchuchunnanu

    Sodara dussasana anarkhala ratna sakti kireetamunu vegiramuga temmu

    Maama gandhara sarvabhauma suruchira manimaya mandita suvarna simhasanamunu teppinpudu

    Parijanulara punya bhaageeradhi nadi toyamunu andukonudu

    Kalyana bhattulara mangala kudiyaramulu suswaramuga mroganindu

    Vandhimagadhulara karna maharajuku kaivaramu gavinmpudu

    Punyanganulara ee raadhasutuni kapalabhagamuna kastoori tilakamu teerchididdi bahujana sukruta pareepata saulabdha sahaja kavacha kasabha vaidhoorya prabharichotiki vanchinchina rega veera gandhamu vijralpudu

    Nedu ee sakala mahajana samakshamuna pandita parijana madhyamuna sarvadha sarvadha setadha sahasradha ee kula kalanka maha pankilamunu saswatamuga prakshalana gavincheda...

    ReplyDelete
    Replies
    1. Hello brother, hats off for your dialogue lyric, naku DVSK loni anni dialogues vachu kani danilo anta spashtatha ledu kani idi chusina tarvata naku arthamaindi nenu chala crrct chesukovalani........if u don mine naku inka konni dialogues kavali pampagalara...pls
      ...dialogues frm---->mayasabha ku vachina ahvanam chadivettappudu, mayasabha lo jarigina avamanam, droupadi vastrapaharanam lo duryodhanudu cheppe dialogues, krishnudu rayabaraniki vachinappudu duryodhanudu cheppe counter speech kavali......mail me at Adityaunemployed@gmail.com or Adityavemula@hotmail.com......thats it
      n thx for the lyric.

      Delete
    2. brother.. ee second part kosam enta vetikanuu..... ekkada ledu... chivariki idigo ee comments l0o dorikindi... thank u thanks a lot..

      Delete
    3. Awesome Bro, i thought of putting on paper, but i got it in ur blog

      Delete
    4. Avura e rathana chamathkruthi emiyogani prakruthi soundharyamunohankarinchuchu kuru saarvabhoumundanyna naa ee maanasamunu sahithamu aakarshinchuchunnadhiye
      Veeeru na natulalinchiyundaru kadha
      Oriee meerulevvarun
      I wanf theese full dialogue script if any 1 know kindly reply me tq

      Delete
    5. Lot many mistakes u have written man

      Delete
    6. So many mistakes is there chesk it bro

      Delete
  6. Hi....Brother we need dialog...Ofter mayasbha parabhavam.....Panchali pancha badhruka.......

    ReplyDelete
  7. ee dailige lo china chinavi chala unnay brother

    ReplyDelete
  8. kurukula vruddhudayina ye SANTHANAVUDU.........not santha ramudu........better correct it bro

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఆచార్య దేవా!
      యేమ౦టివి యేమ౦టివి
      జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా.... ఎ౦త మాట ఎ౦త మాట???
      ఇది ఛాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
      ఇది కుల పరీక్షయే అ౦దువా....నీ త౦డ్రి భరధ్వాజుని జన్మమెట్టిది?
      అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
      ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయైన‌
      గ౦గా గర్భమున జనియి౦చలేదా... ఈయనది యే కులము?
      నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా...?
      అతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
      ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
      ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
      పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
      మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా...?

      స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
      కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదములె౦దులకు?

      ................కొ౦డవీటి వే౦కట కవులు....



      Delete
    3. Please give me some links, if u know - SVR Dialogues..

      Delete
  10. Extraordinary and superb dialogs friends hats of for ur dialogue explanation..

    ReplyDelete


  11. panchali pancha bhathruka ....
    ame ameme ne vunmatha vikatatha hasamu..
    yantha maruvaithninchinanu marupunakuraka hurdhya seriraya manamulaina
    ne parihasaravambule na karna patambulu baiyalu cheyuchunnave
    aho kshera varasi janitha raka sudhakara vara vamsa smothama mahothama
    kshethriya paripalitha bharatha samrajaya dhoreyundanai..
    nija buja veera prakampitha chathurdasa bhuvana suraveerandalagu satha sodharulaku agrajundanai
    parameshvara padhabiratha parusurama sathguru praptha sastharasthra
    pareyundaina radheyuniki mithrundanai......
    manadhanudanai, manugada saginchu nannu chuchi oka adadhi parichalekai parivuththai
    pagula padi nuvvutaya....
    aho thana pathulatho suyudagu nannu bavaga sambhavimpaka,sammanimpaka,
    gruhini dhrama parichathai, lajja vimukthiai....a bhandhaki getta yedhuta ela
    geli cheyavale......avunule a vayasumalina bhamaki yeggemi siggemi
    vanthu vanthuna magari mundhoka magarini vachchara pariyanthamu rechina kanu
    pichchitho pachchi pachchi vaibhavamuna thelinchu aali gelichesina mathramu memela
    katakata padavalee vura kukka vuchithanuchitha gnanam tho morethi kuthliduna...
    ani saripettukundhuna aaa e lokamu yemanakunda vunduna....
    inanu durvyajamuna saginju yagamani thelisithelisi nenela ravale...
    vachithime po...divirathna prabha sopethami sarvathra sankshobhithamaina
    a mayasabha bhavanamu makela vidithi kavali...inadhi po ............
    andhu chithra vichithra lavanya harulalo edhularu dhubhukshapeksha makela
    kalugavale.......kaliginadhi po......sajicharachara santhanavethanamuna
    kala ralamagu a jalasayamuna memela kalumopavale.........mopithime po
    sakala rajanyana kotirakotithalokchiptha rathna prabhanirajithamagu ma
    padha padhmamela apabhraminchavale... yethasamayamuna parichalicha
    parivuththaina a pathaki panchali yela ravale vikshinchavale parihasinchavale
    a hathavidhi.....a hathavidhi.....a hathavidhi..............
    ajanma shethruvule ane anumanichuthune arudhinchina mamu avamanabalamana jwalalu
    dhagdhamaluchuchunnavi mama.....vimukuni sumukunichesi mammatuku vijayamu cheyinchina
    ne vignanavishesha vibhathikyamulemainavi mama....
    panchali kruthavamana manasudanai manathi mana vanchithudanai mariyadhathrikaamanamuga
    mannutaya,....parihasa pathramaina e brathukopaleka maraninchutaya....
    ichchi adudhani pai pagasadheppaleka asuparichchyagamu saginchadani apakeerthi apaina
    verokatiaaa eppudu yedhi karthavvam..?
    manutaya.....maraninchutaya.. yedhi karthavvam?

    ReplyDelete
    Replies
    1. sukumarudu movie lo 'aavura e rachana chamkkruthi yemi yego kuru sarvabhomudanaina na manasamu sayitham akrshinchinchuthunadi 'ani oka dilogue undi adi lyrics kavali bro

      Delete
  12. మా ఇంట్లో కారం లేనిదే తినం
    వంట్లో అహంకారం లేనిదే బ్రతకం
    కావూరు నాకోడుకులం
    చంపేస్తాం లేకుంటే చస్తాం.......

    ReplyDelete
  13. wonder full dialogue from N TR in single take

    ReplyDelete
  14. Superrrr ......--Thanks fr this evergreen dialogue lyrics(both English & Telugu)

    ReplyDelete
  15. ee rojullo ilanti sambhashanalu evaru rayagalaru cheppagalaru..adee mana telugu bashanu chinna nati nundi chaduvvukuni kuda ilanti sambhashanallo kaneesam rendu vaakyamulaina spastanga palakaleka, apaina maku telugu radu ani cheppukovadam edo goppa arhataga tayarainaru mana telugu yuvatha. prapanchamanthata tama tama matrubhashalo matladatam goppaga bhavistonte manam matram angla basha mojulo padi mana acha telugu nu antham cheskuntunnamu..prabhutvalaku kuda telugu pai shradda ledu..

    ReplyDelete
    Replies
    1. Deepak arvindh gaaru i wil tell some dailogues kindly make a call my number 8500053163

      Delete
    2. Deepak arvindh gaaru i wil tell some dailogues kindly make a call my number 8500053163

      Delete
  16. పాంచాలి పంచ భద్రుక..
    ఏమే ఎమేమే నీ ఉన్మత్త వికట్టట్టహసము

    ఎంత మరువ యత్నినించినను మరపునకు రాక... హృదయ సేరీరాయ మానములైన నీ పరిహసారావములే నా కర్నపటంబులు బయ్యలు చేయుచున్నవే...

    అహో క్షీర వారాసి జనిత రాక సుధాకర వర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరేయున్దినై....

    నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన షూరవరీన్యులగు శత సోదరులకు అగ్రజండునై....

    పరమేశ్వర పాధభిరత పరుశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యా పారేయుండయిన రాధేయునికి మిత్రున్దనై....

    మానధనుడనై.. మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరివృత్తయయి
    పగులబడి నవ్వుటయా....

    అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక.. సమ్మానిమ్పక..
    గృహిణీ ధర్మ పరిచత్యయై.. లజ్జా విముక్త్యయై.. ఆ భందకి ఎట్ట ఎదుట ఏల గేలి చేయవలె..

    హహ.. అవునులే ఆ వయసుమాలిన భామకి ఎగ్గేమి సిగ్గేమి.. వంతు వంతున మగలముందొక మగనిని వచ్చర పర్యంతము రెచ్చిన కను పిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున హ హహ.. నేనేల కటకట పడవలే.. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కుతలిడునా.. అని సరిపెట్టుకుందునా.. హ.. ఈ లోకము మూయ ముకుడున్డునా....

    ఐనను ధుర్వియాజమున సాగించు యాగమని తెలిసితెలిసి నేనేల రావలే.. వచ్చితిమి పో.. దివ్యరత్న ప్రభా సౌపేతమైన సర్వత్ర శౌశోభితమైన ఆ మయసభా భవనము మాకేలా విడిథి కావలె.. ఇనది పో.. అందు చిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు దుర్భిక్షపేక్ష మాకేల కలుగవలె.. కలిగినది పో.. సజీవ జలాచర సంతానవితానములకు ఆలవలమగు ఆ జలాశయమున మేమేల కాలుమోపవలె.. మోపితిమి పో.. సకల రాజన్య కోటిర కోటిత కోచిప్త రత్న ప్రభానిరంజితమగు మా పాద పద్మమేల అపభ్రమ్సమొన్ధవలె..
    ఎత్తసమయమునకే పరిచారికా పరివ్రుతయై ఆ పాతకి పాంచాలి ఏల రావలె.. వీక్షించవలె.. పరిహసించవలె..

    హా హథవిథి.. హా హథవిథి.. హా హథవిథి

    ఆజన్మ శత్రువులే అని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమానబడబాలన జ్వాలలు ధగ్థమొనర్చుచున్నవి మామా.. విముకుని సుముకునిచేసి మమ్ముటకు విజయముచేయించిన నీ విజ్ఞానవిశేష విభాతిక్యములేమైనవి మామా..

    పాంచాలి క్రుథావమాన మానసుడనై మానాతి మాన వంచితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. పరిహాసా పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరనిచుటయా..

    ఇచ్చీ ఆడుదానిపై పగసాదింపలేక ఆశుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా.. ఇప్పుడు ఏదీ కర్త్యవ్యము..?

    మనుటయా.. మరణించుటయా.. ఏదీ కర్త్యవ్యము..?

    ReplyDelete
  17. Searched a lot for dialogues in telugu script, finally decided to write myself...

    ReplyDelete
  18. Tq brother .... Ragging ki baaga panikochindi.... Seniors champestunnaru dialogues rasukuni rammani... Anyways thank you a lot.. please don't stop these here

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  19. Thank you very much..... No words for your help. Great full to u

    ReplyDelete
  20. Thank you very much..... No words for your help. Great full to u

    ReplyDelete
  21. Bhayya aa dialogue prakaram ....shantanavudu sivasamudrula bhaarya agu ganga garbhamuna janiyinchaleda......ani undi...Ante daniki artham ...shantanavudu ganga putrudu ane na????

    ReplyDelete
    Replies
    1. Ikkada shanthanavudu ante shanthanuni puthrudaina bheeshmudu
      So, bheeshmudu ganga puthrudu

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  22. Fortunate are Telugu people for the poetic splendour of the language and the figure and diction (ఆయనకు మాత్రమే సొంతమైన రాజసం ఒలికే నిండైన విగ్రహం, గంభీరమైన స్వరం)of the one and only NTR.

    ReplyDelete
  23. ఆచార్యదేవా...!
    ఏమంటివి ఏమంటివి...!
    జాతి నేపమున సూత సితులకిందు నిలువ అర్హత లేదందువా...
    ఎంత మాట ఎంత మాట..
    ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రీయ పరీక్ష కాదే...
    కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా..
    నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది..
    అతి జుగుబుసాకారమైన నీ సంభవమెట్టిది...
    మట్టి కుండలో పుట్టితివి కదా ..
    నీది ఏ కులము..?
    ఇంతయేల,
    అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు ఐన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..!
    ఈయనది ఏ కులము..?
    నాతో చెప్పింతువేమయ్యా..!
    మా వంశముku మూల పురుషుడైన వశిష్ఠుడు, దేవా వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాదా..!
    ఆతడు పంచమి జాతి కన్య ఐన అరుంధతి అందు శక్తీ ని , ఆ శక్తీ ఛండాలంగాని యందు పరాశరుని..
    ఆ పరాశరుడు పల్లెపడతి ఐన మత్స్యగాని యందు మా తాత వ్యాసుని..
    ఆ వ్యాసుని విధవరాండ్రైన మా పితామహి ఐన అంబికతో మా తండ్రిని..
    పైన పితామహి అగు అంబాలిక తో మా పైన తండ్రి పాండు రాజు ను.. మా ఇంటి దాసీ తో ధర్మ నిర్మాణాజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విధృవదేవుని కనలేదు..!
    సంధభావసరములను బట్టి క్షాత్ర బీజ ప్రాధాన్యములతో సంకీలమైన మా కురు వంశము, ఏనాడూ కులహీన మైనది..
    కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదములెందులకు
    ఓహో రాచరికమా అర్హతని నిర్ణయించునది.. !
    ఉమ్మ్ హ్మ్మ్ ..
    ఐన మా సామ్రాజ్యం సస్యశ్యామలమై సంపదగ్రహమై వెలుగొందుతూ అంగ రాజ్యమునకిపుడే ఇతను మూర్ధాభిద్యకుడిని గావించుచున్నాను ..
    సోదరా దుశ్యాసన...! అనర్ఘరత్నసథంకిరీటమును వేగముగా తెమ్ము ...
    మామా ఘాందార సార్వభూమా ..! సిరిచిరా .మణిమయ .మండిత .సువర్ణ .సింహాసనమును అదీష్టింపుడు ..
    పరిహరులారా ..! పుణ్య భాగీరధునది తోయేమనులనందుకొనుడు...
    కళ్యాణభట్టులారా..! మంగళసూర్యనములను సుస్వరముగా మ్రోగనిండు ...
    వంధిమారధులారా ...! కర్ణ మహారాజును పరివారము గావింపుడు ..
    పుణ్య అంగారులారా ..! ఈ రాజా .స్తుతునకు .ఫాల .భాగమున .kasthoori తిలకమును తీర్చిదిద్ది .
    బహుజనసుకృతాభిదా .పరీపాకశాలబ్ధ .సహజ .కవచ .కర్ష .వైడూర్య .ప్రభావించువాటి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యారాల్చుడు ...
    నేనీ సకల జనహమధ్యమున ....
    పండిత పరిషద్మధ్యమునా ...
    సర్వదా సర్వదా ....
    శతధా సహస్రధాయ ...
    ఈ కుల కాలంగా మాహా పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను...!!!!

    ReplyDelete
  24. Dude can you post the dialogue of English pellam east godavari mogudu srikanth telling the dialogue with all the ladies

    ReplyDelete
  25. 1.సుయోధనుడు ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకించుట
    ఆగాగు!
    ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి ?

    జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !

    ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ?

    కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా !

    నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?
    మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము?

    ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ! ఈయన దే కులము ?

    నాతోనే చెప్పింతువేమయా , మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా ?
    ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా?

    సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?

    ReplyDelete


  26. 2.కర్ణుడి పట్టాభిషేకం


    ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది.
    అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.

    సోదరా.. దుశ్శాసన ! అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము,

    మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము,

    పరిజనులారా ! పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు,

    కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

    వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు,

    పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది
    బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్యప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు.

    నేడీ సకలమహాజనసమక్షమున, పండితపరిషన్మధ్యమున సర్వదా సర్వదా, శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను .

    హితుడా ! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమేకాదు.. నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.

    ReplyDelete



  27. 3.సుయోధనుడికి పాండవుల రాజసూయాగం ఆహ్వానం వచ్చినప్పుడు

    ఊం.. ఉ.. హహహహ

    విరాగియై పాండురాజుకు సరాగినియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !

    ఆబాల్యమున ఆటపాటలలో మమ్ము అలమటపెట్టిన పాండవులు !


    లాక్కాగృహములో నిశీధిని నిట్టనిలువునా ధహించివేసారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !

    ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకు వళ్ళుమెక్కిన పాండవులు !

    అంతకుతగ్గగంతగా అతుకులబొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !

    స్నాయువతా సంకలిత శల్యము సంప్రాప్తించిన సుంకంమ్మన్నటుల
    మా పిత్రుదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా !

    నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు
    జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?

    ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురు పాండురాజునకు తమ్ములేగదా !
    ఐన ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?

    అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహోనినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వము సాదింపగోరి పాండవుల దుష్ప్రయత్నమా ఇది !

    సాటిరాజులలో రారాజు కావలెననియెడు ధర్మజుని దుష్టంతరమా ఇది !
    ఐనచో కుతంత్రముతో కుచ్చితబుద్ధితో సేయనెంచిన ఈ రాజసూయము సాగరాదు, మేమేగరాదు.

    ReplyDelete


  28. 4.మయసభ ఘట్టం


    అహొ !
    అమ్లానభావసంభావితమైన ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..

    అనిమిషయామినీ అతిధిసత్కార దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,

    ఆ.. హహ్హహ,,
    ఓ..
    ఆ.. ఏమా సుమధుర సుస్వరము !
    కాకలీకలకంటికంటి కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా .
    సొబగు సొబగు.. సొబగు సొబగు..

    ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ..
    ఔ.. ఔ..

    అయ్యారే !
    భ్రమ.. ఇదినా భ్రమ ..
    కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..

    భళా !
    సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే ఈ సభాభవనము ధన్యము..ధన్యము..

    అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని లేదు.. లేదు.. లేదు ..

    ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.

    విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..

    అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..

    సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..

    కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము.

    చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.

    ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా!

    ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.

    ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన జలాశయమా ! ఆహ్

    అంతయు మయామోహితముగా ఉన్నదే !

    ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ...

    పాంచాలీ... పంచభర్త్రుక ...

    వదరుపోతా.. వాయునందనా ...

    పాంచాలి.. పంచభర్త్రుక.. ఏమే.. ఎమేమే.. నీ ఉన్మత్తవికటాట్టహాసము ? ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.

    అహొ ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై ...

    నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై ...

    పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై..

    మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?

    అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?

    అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున మగలముందొక మగనిని వచ్చనపర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?

    ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా ! ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !

    ఐనను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో !

    నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !

    అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో !

    సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి
    పో !

    సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం చెందవలె.. ఏకత్సమయమునకే పరిచారికాపరీవృతయై ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?

    ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..

    ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు ధగ్ధమోనర్చుచున్నవి మామా..

    విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?

    పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..

    ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా...

    ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?

    ReplyDelete



  29. 5.మాయాజూదంలో సుయోధనుడు గెలిచినపుడు


    మాయురే మామా.. మాయురే హహహః
    చరిత మరువదు నీ చతురత.. మాట చెల్లించిన నీకే దక్కును యెనలేని ఘనత
    మా ఎద సదా మెదలును మామ యెడ కృతజ్ఞత .

    ప్రాతిగామి ! ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ..

    ఓహో
    వయోవృ ద్దులు , గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మము అధర్మమని ఆవులించుచున్నది.

    జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?

    ఐనను జూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదునుచేసి ఆడించితినే కాని చతుషష్టి కళా విశారదుడనగు నేనాడలేదే ! ఆట తెలియకనా ? హహహ.. ధర్మమూ తెలియును గనుక.

    కాని ధర్మాధర్మములు విచారింపక తన తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?

    తమనొడ్డినపుడైన తమ్ములు నోరు మెదపిరా ?

    ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?

    చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది అమానుషమన్నవారులేరే ?

    అ.. ఆ..
    నేను గెలచుటచే మయా తిరోతరమైనది , ధర్మజుడే గెలచిన ధర్మమే జయించినదని మీరు జేజేలు కొట్టిఉండెడి వారు కాదా !

    మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను ఖండించి అధర్మ దేవతను ప్రళయ తాండవ మాడింపకుడు ..

    తాతా! అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం.

    నాడు నను అతిధిగా ఆహ్వానించి పరిహసించిన పంచ భర్త్రుక పాంచాలి పై పగ సాధించుటే దీని ఆంతర్యం.

    అంతియేకాని మా పితృ దేవ దయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు అల్పుడను కాను, అందునా జూతార్జితమగు విత్తము పై చిత్తము నుసిగొల్పు అధముడను కాను.

    నా హృదయాగ్నిజ్వాలా ప్రతిరూపమే ఈ జూతము తాతా, ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మ ధర్మములతో, పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.

    ReplyDelete



  30. 6.కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం


    రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం..

    పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను.

    రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ..
    నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును తెలియని అజ్ఞానిని కాదు..

    మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి .

    ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని.

    ఊం..
    రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక , ఆపైన మా అభిమతము గ్రహింపక ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి.

    ఇప్పుడు నేను సంధికొడంబడినచో హహ్హ.. హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా ? లేక, నీవు వంధిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ?

    దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి

    హ..హహ.. ఐదూల్లైనా ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి
    కృష్ణా ! నీ కోరిన కోర్కె సరియే ఐనచో, నిజమే ఐనచో నేనీయుటకీ సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా !

    ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి, నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ..

    ఇది గాక ...
    మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?

    పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?

    ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..

    మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?

    అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.

    అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ?

    భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?

    ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?

    అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు.

    అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు ..
    మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?

    ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !

    కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే నా తుది నిర్ణయము .

    ReplyDelete
    Replies
    1. Very nice mam!! I was searching complete dialogues in telugu.

      Delete
  31. Thank you so much mam.. Thank you
    Am so happy..
    Any good dialogues send me mam please....

    ReplyDelete
  32. దశకంతా దశగ్రీవ దశోన్ముఖుడు ....అసురుల చక్రవర్తి ....లంకాధిపతి ..ఈ ..రావణాసురుడు .....ఏ నామము జపించిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో .....ఏ నామము తలిచిన హారులు సురులు గజ గజ వణికిపోవుదురో ...అట్టి పరాక్రవంతులమైన మమ్ములను చూచి ....అల్పులు అధములు నీచులు అయిన.....మా సోదరులు అవహేళన చేయుటయా .....ఇప్పుడే ఈ గదా దండం చే వారి శిరస్సును వెయ్యి ముక్కలు గావించదా .......

    ReplyDelete
    Replies
    1. Hello sir please ee dialogue tarvatha vache "daatha naa rakthamu rangarinchi"" adhi kastha kuda pettandi bro

      Delete
    2. Daatha naa raktamu rangarinchi alakulisarekha chinditamaina mee arunarajasubha paada padmamulaku samlepanamu gaavinchinanu mee runameegu vaadanu kaanu. Ee karnudi tudi raktapu binduvu me yaso rakshanaku me saarvabhouma parirakshanaku ankitamu kaagaladani sarvasamantha maheepala mandalaadi patulu samasta prajaneekamu vichesina ee sabhamandapamuna sapadhamu gaavinchuchunnanu.

      Delete
  33. Sir please send dialogue lyrics between Karna and Kunthi " yentha premam thalli neeki ee soothanathadunam painaa"

    ReplyDelete
  34. Good collection I love the dailogues....

    ReplyDelete